ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే.. ఎలా బతికేది..?' - అనంతపురం సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది నిరసన చేపట్టారు. ఆరు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తమ వేతనాలు చెల్లించాలని కోరారు.

security staf protest at ananthapur government hospital
security staf protest at ananthapur government hospital

By

Published : Apr 8, 2021, 12:07 PM IST

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది నిరసన

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సి ఆరునెలల వేతనాలను చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఆస్పత్రిలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తమ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని కోరారు. సంబంధిత కాంట్రాక్టర్​తో మాట్లాడి వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు. ఆరునెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతకాలంటూ నిలదీశారు.

ఇప్పటికైనా స్పందించి తమ జీతాలు ఇవ్వాలని సెక్యూరిటీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details