ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీతాలు చెల్లించాలంటూ సెక్యూరిటీల ఆందోళన - అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సెక్యూరిటీల ఆందోళన

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. కాంట్రాక్టు పద్దతిలో కాకుండా ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సెక్యూరిటీల ఆందోళన
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సెక్యూరిటీల ఆందోళన

By

Published : Apr 10, 2021, 4:09 PM IST

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఆరు నెలల జీతాలను చెల్లించాలంటూ గత నాలుగు రోజులుగా ధర్నాలు చేస్తున్నా.. అధికారులు కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని నిలదీశారు. తమను కాంట్రాక్టు పద్దతిలో కాకుండా ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details