ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదు నెలలుగా అందని వేతనాలు..కార్మికులకు తప్పని ఇబ్బందులు - security and sanitation works protest at Anantapur

అనంతపురం సర్వజనాసుపత్రిలో కరోనా విపత్కాలంలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది వేతనాలు అందక ఆకలితో అలమటిస్తున్నారు. ఐదు నెలలుగా జీతాలు అందటం లేదని అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

security and sanitation works protest at Anantapur
సకాలంలో వేతనాలు విడుదల చేయాలని కార్మికుల విజ్ఞప్తి

By

Published : Jun 23, 2021, 3:00 PM IST

సకాలంలో వేతనాలు చెల్లించాలని కార్మికుల విజ్ఞప్తి

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 120 మంది ప్రైవేట్ సెక్యూరిటీ, 160 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీరిలో చాలామంది పదేళ్లకు పైగా అక్కడే పని చేస్తున్నారు. ఏటా కొత్తగా గుత్తేదారు రావటం.. వీరికి ఇవ్వాల్సిన వేతన బకాయిలు కాజేసి వెళ్లిపోవటం జరుగుతుంది. ఇలా అనేకసార్లు వీరి శ్రమను దోచుకున్నా గుత్తేదారులపై ఆసుపత్రి అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోవట్లేదు. జీతాలు ఇవ్వమని అధికారుల వద్దకు వెళ్తే.. తమకు సంబంధం లేదని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయని సిబ్బంది వాపోతున్నారు.

ఆ ఉత్తర్వులను ఖాతరు చేయట్లేరు

ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర నిర్వహించిన సమయంలో.. పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి రూ.16వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు జగన్ సీఎం అయ్యాక వేతనం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అధికారులు వాటిని ఏ మాత్రం ఖాతరు చేయని పరిస్థితి. వేతన బకాయిలు ఉన్న విషయం వాస్తవమని.. రూ. నాలుగు కోట్ల ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు.

కొవిడ్‌ రోగులకు పరోక్షంగా సేవలందిస్తున్న తమకు సకాలంలో వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలని పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది.. అధికారులను కోరుతున్నారు.


ఇదీ చదవండి..

Nara Lokesh: 'రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమం'

ABOUT THE AUTHOR

...view details