ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడు బృందాలుగా ఉద్యమాలు చేయనున్నాం: ఎస్ఎఫ్ఐ - అనంతపురంలో ఎస్ఎఫ్ఐ సమావేశం

వైకాపా ప్రభుత్వం, భాజపాతో కలిసి రాష్ట్రాన్ని అదాని, అంబానీలకు ధారాదత్తం చేయడానికి కుట్ర చేస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్ ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ఉద్యమిస్తామని తెలిపారు.

SFI meeting
ఏడు బృందాలుగా ఉద్యమాలు చేయనున్న ఎస్ఎఫ్ఐ

By

Published : Feb 11, 2021, 7:39 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ ​పరం చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్ అనంతపురంలో మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏడు బృందాలుగా ఉద్యమాలు చేయనున్నామని తెలిపారు.

ఈ నెల 14 , 15 , 16 న కడపలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గుంటూరు నుంచి బైక్ ర్యాలీతో కార్మిక, ప్రజా, విద్యార్థి సంఘాలతో 17న విశాఖ చేరుకోనున్నారు. అనంతరం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మహాసభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details