అనంతపురం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాప్తాడు, కనగానపల్లి మండలాల్లో పోటీ చేసిన అభ్యర్థుల మధ్య చిన్నపాటి గొడవలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఎలాంటి గొడవలు లేకుండా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరినట్లు స్థానికులు చెబుతున్నారు. ధర్మవరం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్లలో 308 గ్రామ పంచాయతీలు, 3200 వార్డులు ఉన్నాయి.
అనంతపురం జిల్లాలో రెండో విడత ఎన్నికలు విజయవంతం - అనంతపురం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు
అనంతపురం జిల్లాలో రెండో విడత ఎన్నికల్లో పలు చోట్ల ఓట్ల లెక్కింపు తెల్లవారు జాము వరకు కొనసాగింది. చిన్నపాటి గొడవలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు.
![అనంతపురం జిల్లాలో రెండో విడత ఎన్నికలు విజయవంతం second phase Elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10621482-206-10621482-1613286616598.jpg)
అనంతపురం జిల్లాలో విజయవంతంగా పూర్తి అయిన రెండో విడత ఎన్నికలు
వీటిలో 15 గ్రామపంచాయతీలు, 793 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 293 సర్పంచి, 2393 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. ఐదు వేల లోపు ఓట్లు కలిగిన పంచాయతీల్లో రాత్రి పది గంటలకు లెక్కింపు పూర్తి అయి ఫలితాలు వెలువడ్డాయి. మేజన్ గ్రామ పంచాయతీల్లో తెల్లవారుజాము వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఈరోజు ఉదయం రెండో విడతలోని అన్ని స్థానాలకు ఫలితాలు ప్రకటించారు. 308 గ్రామ పంచాయతీలు, 3186 వార్డులకు ఫలితాలు వెల్లడించారు.
ఇదీ చదవండీ..ఆ ప్రాంతంలో మహిళలదే విజయభేరి