అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంట పరిధిలోని సత్యసాయినగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పాము కాటుకు గురైన విద్యార్థి పవన్ మంగళవారం మృతి చెందాడు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మంగళవారం కర్నూలు ఆస్పత్రి నుంచి ధర్మవరానికి బాలుడి మృతదేహాన్ని తీసుకువచ్చారు. పవన్ తల్లిదండ్రులు గంగాదేవి, వీరప్ప తమ కుమారుడి మృతదేహం చూసి బోరున విలపించారు. ధర్మవరం ఆర్డీవో తిప్పే నాయక్, రెవిన్యూ అధికారులు, విద్యాశాఖ అధికారులు... పవన్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చూస్తామని అధికారులు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.
పాము కాటుకు గురైన చిన్నారి పవన్ మృతి - kid
పాఠశాలలో పాముకాటుకు గురైన విద్యార్థి పవన్ చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు.
ఇదీ జరిగింది
సత్యసాయినగర్ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో పవన్ అనే విద్యార్థి రెండో తరగతి చదువుతున్నాడు. అయితే ఈనెల 17న పాఠశాలకు వెళ్లిన పవన్.. మధ్యలో మూత్రశాలకు వెళ్లాడు. అక్కడ నీరు లేకపోవడంతో పాఠశాల సమీపంలోని ముళ్ల పొదల వద్దకు వెళ్లిన క్రమంలో పవన్‌ను పాము కాటు వేసింది. ఇది తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు పవన్‌ను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మెరుగైన వైద్యానికి కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాగా పవన్ తల్లి క్యాన్సర్తో బాధపడుతోంది. ఇప్పుడు కొడుకు దూరమై మరింత కుమిలిపోతోంది.