ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లులో నాటుసారా స్థావరాలపై సెబ్ అధికారులు దాడులు చేశారు. సారా తయారీకి సంబంధించి వారికి అందిన సమాచారంతో సోదాలు నిర్వహించారు. సుమారు 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
నిందితులను గుర్తించి.. వారిపై కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. గ్రామంలో ఎవరైనా నాటుసారా తయారు చేసినా.. అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబీ అధికారి శ్యాంప్రసాద్ చెప్పారు.