అనంతపురం జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పరిగి మండలంలోని కోనాపురం క్రాస్ వద్ద 180 కర్ణాటక మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఆదోని శివారు రణమండల కొండల్లో జరిపిన తనిఖీల్లో 400 లీటర్ల ఐడీ , బెల్లపు ఊటను గుర్తించి.. ధ్వంసం చేశారు. సారా తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే.. కఠినంగా వ్యవహరిస్తామని ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్ తెలిపారు.