అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో మద్యం అక్రమ రవాణాపై ఎస్ఈబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 1,824 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మద్యం రవాణాకు ఉపయోగించిన కారు, ఆటో, ఆరు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని చెప్పారు.
అక్రమంగా తరలిస్తున్న 1,824 కర్ణాటక మద్యం ప్యాకెట్లు సీజ్
అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 1,824 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
కర్ణాటక మద్యం ప్యాకెట్లు సీజ్ చేసిన ఎస్ఈబీ అధికారులు
పోలీసుల అదుపులో ఉన్న నిందితుల్లో ఒకరు ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్, మరొకరు వెలుగు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారని ఎస్ఈబీ అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తే.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదనన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:రూ.1.32 లక్షల విలువైన మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్టు