రాష్ట్రంలో శానిటైజర్లు తాగి పలువురు మృతి చెందడంతో ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా మడకశిర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్సై డార్కస్, సిబ్బంది పట్టణంలోని ఔషధ దుకాణాల్లో శానిటైజర్లు, సర్జికల్ స్పిరిట్ల నిల్వ, అమ్మకాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. శానిటైజర్లను ఎక్కువ పరిమాణంలో ఒకే వ్యక్తికి ఇవ్వరాదు. మత్తు పదార్థాలకు బానిసైన సాధువులు, యాచకులకు శానిటైజర్లను అమ్మరాదని ఔషధ దుకాణ యజమానులకు అధికారులు సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
మడకశిరలోని ఔషధ దుకాణాల్లో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు - మడకశిరలో మందుల దుకాణాల్లో ఎస్ఈబీ సోదాలు
అనంతపురం జిల్లా మడకశిరలో ఔషధ దుకాణాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శానిటైజర్లను సాధువులకు, యాచకులకు అమ్మరాదని మెడికల్ దుకాణాదారులకు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
![మడకశిరలోని ఔషధ దుకాణాల్లో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు మడకశిరలోని ఔషధ దుకాణాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు తనిఖీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8411965-160-8411965-1597370747263.jpg)
మడకశిరలోని ఔషధ దుకాణాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు తనిఖీలు
ఇవీ చదవండి