కరోనా కట్టడిలో భాగంగా అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని పలు దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా దుకాణాల్లో సరుకులు విక్రయిస్తున్న 5 దుకాణాలపై 20వేల వరకు జరిమానాలు విధించారు. ఎవరైనా అనధికారికంగా దుకాణాలు తెరిచిన.. నిబంధనలు పాటించకుండా ఉంటే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి అందరూ సహాయంగా ఉండాలన్నారు.
గుంతకల్లులో కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలపై వేటు - గుంతకల్లులో దుకాణాలకు జరిమానా
అనంతపురం జిల్లా గుంతకల్లులో కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలపై వేటు వేశారు కోవిద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఐదు దుకాణాలకు రూ. 20 వేలవరకు జరిమానా విధించారు.
![గుంతకల్లులో కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలపై వేటు seb officers fines to shops at guntakallu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8121262-789-8121262-1595383490661.jpg)
గుంతకల్లులో కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలపై వేటు