ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండాల్లో ఎస్ఈబీ దాడులు.. 3వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - అనంతపురంలో బెల్లం ఊటను ధ్వంసం

గుంతకల్లు నియోజకవర్గంలోని పలు తండాల్లో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు దాడులు చేపట్టారు. ప్రధానంగా గుత్తి, పామిడి, గుంతకల్లు మండలాల్లో సుమారు 3 వేల లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

SEB officers destroyed three thousand litters jaggery
3వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

By

Published : Nov 1, 2020, 5:28 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ పరిధిలోని తండాల్లో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో (ఎస్​ఈబీ) అధికారులు దాడులు నిర్వహించారు. గుత్తి మండలం బసినేపల్లి తండాలో 500 లీటర్లు, పామిడి మండలం ఎగువ తాండలో 1950 లీటర్లు, గుంతకల్లు మండలంలో 460 లీటర్లు... మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 3 వేల లీటర్లకు పైగా బెల్లం ఊటను ధ్వంసం చేశామని డీఎస్పీ తెలిపారు. 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేశామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details