అనంతపురం జిల్లాలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యురో (సెబ్) బృందాలు ఆదివారం ముమ్మరంగా దాడులు నిర్వహించాయి. 3,500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 20 మందిని అరెస్టు చేశారు. 97 లీటర్ల సారా, 77 టెట్రా ప్యాకెట్లు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు సెబ్ ప్రత్యేకాధికారి రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో దాడులు సాగాయి.
వజ్రకరూరు మండలం, తనకల్లు మండలంలోనూ పోలీసులు దాడులు నిర్వహించారు. తండాలు, పరిసర ప్రాంతాలు, పొలాలు, అటవీ భూములు, గడ్డివాములు, పశువుల పాకలు, సరిహద్దు రహదారుల్లో ఈ తనిఖీలు చేశారు. రూ.30 వేలు విలువ చేసే టపాసులు, రూ.27,903 విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, రూ.11,160 నగదు, నాటు సారా తయారీకి వినియోగించే 110 కిలోల బెల్లం, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో...