ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 16న సీట్ల పంపకాలు - cpi

జనసేనతో సీట్ల పంపకాలపై ఈ నెల 16న చర్చించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు డబ్బుతో ప్రజలను ప్రలోభపెట్టకుండా నిలువరించాలని రామకృష్ణ ఎన్నికల కమిషన్​ను కోరారు.

మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ

By

Published : Mar 14, 2019, 4:06 PM IST

మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
ఈ నెల 16న సీపీఐ, సీపీఎం పార్టీల అగ్రనేతలుజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్​తో సమావేశం కానున్నారు.సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. రాష్ట్రస్థాయి కమిటీ నిర్వహించి, ఏ జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటామనిసీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డబ్బుతో ప్రజలను ప్రలోభపెట్టకుండా నిలువరించాలని ఆయన ఎన్నికల కమిషన్​ను కోరారు. అనంతపురంలో సీపీఐ జిల్లా కమిటి సమావేశానికి హాజరైనరామకృష్ణ... టికెట్​ రాలేదన్న పేరుతోరాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారని ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details