అనంతపురం జిల్లావజ్రకరూర్ మండలం ఎన్ఎన్పీ తండాలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడ పూలు, పసుపు, కుంకుమ వేసి... క్షుద్రపూజలు చేశారని స్థానికులు చెబుతున్నారు.
గుప్తనిధుల కోసం ఆంజనేయుని ఆలయం వద్ద క్షుద్రపూజలు - గుప్తనిధుల కోసం తవ్వకాలు
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నిధులు అక్కడ నిక్షిప్తమయ్యాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ మాట ఆ నోటా, ఈ నాటా... అక్రమార్కులకు చేరింది. ఇంకేముంది రాత్రికి రాత్రే... క్షుద్రపూజలు, తవ్వకాలకు తెరలేపారు.
అనంతపురం జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు
శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ ఒక ఊరు ఉండేదని... పురాతన ఆంజనేయస్వామి ఆలయం కూడా ఆ కాలంలో నిర్మించిందేనని స్థానికులు తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో ఉపాధి కూలీలు పనులు చేస్తుండగా... వెండి బంగారు నాణేలు లభించాయని చెప్పిన స్థానికులు... వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. ఇలాంటి క్షుద్రపూజలు చేయడం వల్ల ఒంటరిగా వెళ్లాలంటే భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ...దాడులతో రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుంది: యనమల
Last Updated : Jun 24, 2019, 4:39 AM IST