ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పంట నష్టం కలిగించే మిడతలు రాష్ట్రానికి రాలేదు' - ఏపీలో మిడతల తాజా వార్తలు

స్థానికంగా ఉన్న మిడతల నుంచి పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశాలు లేనందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్రిమి కీటకాల వ్యవసాయ శాస్త్రవేత్తలు జాన్సన్, మురళీలు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని దాసప్పరోడ్డులో జిల్లేడు చెట్లపై భారీగా మిడతలు దాడిచేసిన ప్రాంతాలను వారు పరిశీలించారు.

scinitist examined locusts at anantapur
మిడతలను పరిశీలించిన అనంతపురం శాస్త్రవేత్తలు

By

Published : May 29, 2020, 5:50 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని దాసప్ప రోడ్డులో జిల్లేడు చెట్లపై భారీగా మిడతలు దాడిచేసిన ప్రాంతాలను క్రిమికీటకాల వ్యవసాయ శాస్త్రవేత్తలు జాన్సన్, మురళీలు పరిశీలించారు. స్థానికంగా ఉన్న మిడతలు జిల్లేడు ఆకు మాత్రమే తింటాయని పరిశీలనలో తేలిందని శాస్త్రవేత్తలు అన్నారు.

ఎడారి ప్రాంతాలనుంచి వచ్చే మిడతల నుంచి మాత్రమే పంటలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. పంటలకు నష్టం కలిగించే మిడతలు మన రాష్ట్రానికి రాలేదన్నారు. కనీసం ఆనవాళ్లు కూడా లేవన్నారు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణకు చేరుకున్నట్లు సమాచారం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిడతలు మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ వచ్చినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పంటలపై వేపనూనె పిచికారి చేస్తే చాలన్నారు. మైక్ సెట్ ద్వారా శబ్దాలు చేసినా అవి ఇతర ప్రాంతానికి ఎగిరిపోతాయన్నారు.

ఇదీచూడండి.శానిటైజర్‌ తాగి ఏఎస్​ఐ ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details