అనంతపురం జిల్లా పెనుకొండలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. తొమ్మిదో తరగతి చదవుతున్న ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ రావడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమై వైద్యాధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం విద్యార్థులతో పాటు అక్కడ పని చేసే సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కరోనా సోకిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి బాగుందని... హోం క్వారంటైన్ లో ఉంచినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ రావు తెలిపారు.
గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం - new corona cases in anantapur district news
పెనుకొండ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థినికి కరోనా సోకింది. ఫలితంగా తోటి విద్యార్థులు, అక్కడ పని చేసే సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగిటివ్ వచ్చింది.
penukonda anantapur district