అనంతపురం జిల్లా మడకశిర పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న గొలపల్లి గ్రామ సమీపంలో కావలికొండ వద్ద రెండు ఎలుగుబంట్లు రైతులను భయందోళనకు గురిచేశాయి. అటువైపుగా ద్విచక్రవాహనాల్లో ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలు వాటిని చూసి భయపడి అక్కడే నిలబడిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆ ఎలుగుబంట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. గతంలో నియోజకవర్గంలో ఎలుగుబంట్ల దాడిలో చాలా మంది మృతిచెందారు.
గొల్లపల్లి వద్ద దడ పుట్టిస్తున్న ఎలుగుబంట్లు - bears latest news ananthapuram district
అనంతపురం జిల్లా గొల్లపల్లి గ్రామం సమీపంలో ఎలుగుబంట్ల సంచారంతో రైతులు భయందోళనకు గురవుతున్నారు. పొలాల్లోకి వెళ్లి వ్యవసాయం చేసేందుకు రైతులు భయపడుతున్నారు.
ఎలుగుబంట్లను చూసి అక్కడే నిలుచున్న గ్రామస్తులు