ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పడక దొరక్క .. కుర్చీల్లోనే వైద్యం - అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పడకల కొరత

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పడకలు లేక కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నేలపైనే రోగికి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. కేసులు అధికమవుతున్న దృష్ట్యా ఆసుపత్రుల్లో పడకలు పెంచాలని కరోనా రోగుల బంధువులు కోరుతున్నారు.

beds scarcity at ananthapur hospital
beds scarcity at ananthapur hospital

By

Published : May 6, 2021, 1:52 PM IST

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి కొవిడ్‌ ఓపీలో దయనీయ పరిస్థితి నెలకొంది. పడకల కొరత ఏర్పడింది. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మంచాలు కూడా లేవు. కుర్చీల్లోనే వైద్య చికిత్స పొందుతున్నారు. ఊపిరి ఆడక నానా అవస్థలు పడుతున్నా కనికరం చూపడం లేదు. కొందరు బాధితులే ఆక్సిజన్‌ సొంతంగా పెట్టుకుని ప్రాణాలను దక్కించుకుంటున్నారు. వైద్యులు, నర్సులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలే పరీక్షిస్తున్నారు. వీరే రోగులకు ఆక్సిజన్‌ స్థాయి చూసి పంపిస్తున్నారు. పడకలు దొరక్క, ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్య సిబ్బంది బిజీగా కనిపిస్తున్నా.. ఎవరికీ వైద్య చికిత్స అందిస్తున్న దాఖలాలు లేవు. చాలామంది పడకల కోసం నిరీక్షించి వెనక్కి వెళ్తున్నారు. కేసులు అధికమవుతున్న దృష్ట్యా ఆసుపత్రుల్లో పడకలు పెంచాలని కరోనా రోగుల బంధువులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details