అనంతపురం జిల్లా ముదిగుబ్బ పరిధిలో ఉపాధి హామీ పథకం అమల్లో అక్రమార్కులను పోలీసులు అరెస్టు చేశారు. పథకం పేరు చెప్పి ఏకంకా 3 కోట్ల 42 లక్షల రూపాయలను స్వాహా చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఏడుగురిని పోలీసులు గుర్తించారు. వీరంతా డీఆర్డీఏ వెలుగు ప్రాజెక్ట్ ద్వారా ముదిగుబ్బ మండలంలో పండ్ల తోటల పెంపకం విషయంలో చేతివాటం చూపారు. పనులు చేయకుండానే పనులు జరిగినట్లు చూపి..బిల్లులు కాజేశారని కదిరి డీఎస్పీ భవ్య కిశోర్ వివరించారు.
SCAM and ARREST: ఉపాధి హామీ పథకంలో అక్రమార్కులు...ఎన్ని కోట్లు దోచుకున్నారంటే.. - employment guarantee scheme
ఉపాధి హామీ పథకంలో చేతివాటం చూపిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తోటలు పెంచకుండానే ఫలాలు కాజేసిన వారిని పోలీసులు పట్టకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ముదిగుబ్బ పరిధిలో చోటుచేసుకుంది.
ఉపాధి హామీ పథకం అమల్లో చేతివాటం...అరెస్ట్ చేసిన పోలీసులు