అనంతపురం జిల్లాలోని చిన్నమంతూరు గ్రామంలో ఎస్సీ కాలనీవాసులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిత్యం దారికి అడ్డంగా రాళ్లు వేస్తున్నాడని వారు ఆరోపించారు. శనివారం కాలనీకి చెందిన వెంకటేశ్ అనే వృద్ధుడు మరణించడంతో మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించడానికి వెళ్లారు. ఈ క్రమంలో దారికి అడ్డంగా రాళ్లు ఉంచటంతో ఆందోళన దిగారు. రోడ్డుకు అడ్డంగా ఉంచిన బండరాళ్లను, సిమెంటు ఇటుకలను పగలగొట్టి నిరసన చేపట్టారు.
శ్మశానవాటికకు వెళ్లకుండా దారికి అడ్డంగా రాళ్లు..పలువురు ఆందోళన - చిన్నమంతూరు గ్రామంలో శవంతో ఆందోళన
అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చిన్నమంతూరు గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు మృతదేహంతో నిరసన చేపట్టారు. అంత్యక్రియలకు వెళ్లే సమయంలో దారికి అడ్డంగా రాళ్లు, ఇటుకలు పెడుతున్నారని వారు ఆరోపించారు.
మృతదేహంతో ఆందోళన
దశాబ్ద కాలంగా కాలనీకి ఇదే ప్రధాన రహదారని వారు అన్నారు. నాలుగు సంవత్సరాలుగా కాలనీలో ఎవరు మరణించినా అంత్యక్రియలు వెళ్లే సమయంలో ఇలా దారికి అడ్డంగా రాళ్లు, ఇటుకలు వేసి ఇబ్బంది కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి ఎస్సీ కాలనీ దారికి సిమెంట్ రోడ్డు మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు.
ఇదీ చదవండీ..యథేచ్ఛగా దొంగ ఓట్లు.. తిరుపతి ఓటర్ల ఆగ్రహం