చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ తమ్ముడిపై రాజకీయ కుట్రతో దాడి చేస్తే.. పోలీసులు రాజకీయ దాడి కాదనడం విడ్డూరంగా ఉందని ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. బాధితుడు తనపై దాడి చేసి వ్యక్తి గురించి చెప్పినా.. బాధ్యుడిపై కేసు నమోదు చేయకపోవటం ఏంటని ప్రశ్నించారు.
పోలీసులను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు అధికమవుతున్నా, వైకాపా దళిత మంత్రులు మాట్లాడకపోవటం.. వారి స్వార్థ ప్రయోజనాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఆదివారం అనంతపురం జిల్లాలో దళిత ఐక్య సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.