ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది' - sc cell chairman latest news update

విజయసాయిరెడ్డి నేతృత్వంలో విశాఖ జిల్లా కలెక్టర్ రాయబారిగా మారి నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తాం.. ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తాం అంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అనంతపురంలో తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్. రాజు మండిపడ్డారు. సుధాకర్​పై దాడి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.

sc cell chairman ms raju comment
వైకాపా దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

By

Published : May 22, 2020, 1:47 PM IST

వైకాపా ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్. రాజు అన్నారు. డాక్టర్ సుధాకర్​పై విశాఖపట్టణంలో దాడి చేసి హైకోర్టును ఆశ్రయించిన ఆయనతో ఇప్పుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో కాళ్ల బేరానికి రావడం దిగజారుడు రాజకీయం కాదా అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్​కు యావత్ సమాజం అండగా ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details