యూపీలో ఎస్సీ యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ధర్మవరంలో ఐక్య దళిత సంఘాల నాయకులు ఆందోళన చేశారు. బాబూ జగ్జీవన్ రామ్ కూడలి వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన చేసి ఆర్డీవో మధుసూధనకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు తుంపర్తి రమేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
హాథ్రాస్ ఘటనపై ధర్మవరంలో ఐక్య దళిత సంఘాలు నిరసన - ధర్మవరం తాజా వార్తలు
ధర్మవరంలో ఐక్య దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. యూపీలో జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన చేశారు. అనంతరం ఆర్డీవో మధుసూధనకు వినతిపత్రం అందించారు.
![హాథ్రాస్ ఘటనపై ధర్మవరంలో ఐక్య దళిత సంఘాలు నిరసన sc associations protest at hatras incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9034069-915-9034069-1601717966173.jpg)
ఆర్డీవో మధుసూధనకు వినతిపత్రం అందించిన ఐక్య దళిత సంఘం నాయకులు