బ్యాంకులో నగదు స్వాహా... ఆందోళనలో బాధితులు - అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లి ఎస్బీఐలో సొమ్ము స్వాహా
అనంతపురం జిల్లా పుట్టపర్తి పరిధిలోని ఎస్బీఐ బ్యాంకు డిపాజిట్ దారులు సొమ్ము స్వాహాకు గురైంది. ఘటనపై బాధితులు బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని బ్రాహ్మణపల్లి ఎస్బీఐ వద్ద డిపాజిట్ దారులు ఆందోళన చేపట్టారు. తాళం వేసిన బ్యాంకులో రూ.57 లక్షలు స్వాహాకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో... డిపాజిట్ దారులు సొమ్మును వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఫలితంగా బ్యాంక్ సేవలు నిలిచిపోయాయి. రెండేళ్లలో 35 మందిని మోసం చేశారని వాపోయారు. గతంలో ఇక్కడ పనిచేసిన మేనేజర్ రమేష్ రూ.57 లక్షల స్వాహా చేశాడు. ఈ ఘటన 2 నెలల క్రితం వెలుగులోకి వచ్చింది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... వీలైనంత త్వరగా డిపాజిట్ సొమ్ము చెల్లిస్తామని బ్యాంక్ మేనేజర్ హామీ ఇవ్వడంతో... బాధితులు ఆందోళన విరమించారు.