అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లి ఎస్బీఐ బ్యాంకులో, ఒక తాత్కాలిక ఉద్యోగి అరకోటికిపైగా నగదు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న ఖాతాదారులు, పలువురు కమ్యూనిస్టు నాయకులు బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళనచేపట్టారు. తమ సొమ్ముకు ఎవరిది బాధ్యత అంటూ బ్యాంకు అధికారులను నిలదీశారు. తాము చమటోడ్చి బ్యాంకులో డిపాజిట్ చేస్తే బ్యాంకు ఉద్యోగి ఇలా చేయడమేంటని ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెలుసుకుని త్వరలోనే చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు సర్దిచెప్పారు.
'అరకోటికిపైగా కాజేసిన ఎస్బీఐ తాత్కాలిక ఉద్యోగి' - ananthapuram district
కొంతమంది బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారుల కష్టాన్ని సొమ్ముగా మార్చుకుంటున్నారు. డబ్బుపై ఆకర్శణతో ఖాతాదారుల నగదు కాజేశాడు. ఇటీవల ఎస్బీఐ బ్యాంకు తాత్కలిక ఉద్యోగి అరకోటికిపైగా నగదు కాజేసిన ఘటన బ్రాహ్మణపల్లిలో చోటుచేసుకుంది.
'అరకోటికి పైగా కాజేసిన ఎస్బీఐ తాత్కలిక ఉద్యోగి'