'ప్రతి నీటి బొట్టును నిల్వ చేయాలి' - 'ప్రతీ నీటి బొట్టును నిల్వ చేయాలి'
ప్రతి నీటిచుక్కను నిల్వ చేయాలనే లక్ష్యంతో జలశక్తి అభియాన్ కమిటీ పలు కార్యక్రమాలకు శ్రీకారంచుట్టింది. నేలపై రాలే ప్రతి నీటి బొట్టును కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనుంది.
నేలకు రాలిన ప్రతి నీటి బొట్టును భూమిలో నిల్వ చేద్దామని జలశక్తి అభియాన్ కమిటీ జిల్లా చైర్మన్ చాంగ్ సన్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ...గాండ్లపెంట తనకల్లు మండలాల్లో ఆయన పర్యటించారు. ప్రతి నీటి చుక్కను నిల్వ చేయడానికి జల సంరక్షణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జల శక్తి అభయాన్ ద్వారా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందచేశారు. జులై ఒకటి నుంచి 15ను వరకు జిల్లాలో 26 మండలాలలో వివిధ కార్యక్ర మాలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో.. నీటి సంరక్షణ పై చర్చా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపనున్నట్లు తెలిపారు.