ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవదాసీ, జోగినీ మహిళలకు సత్యసాయి ట్రస్ట్ ఆపన్నహస్తం - పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ వార్తలు

దేవదాసీ, జోగినీ మహిళలకు ఆపన్న హస్తం అందించేందుకు అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ముందుకొచ్చింది. 190 గ్రామాల్లో 1500 మంది దేవదాసీలను గుర్తించి వారికి నిత్యావసరాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సరకులతో కూడిన వాహనాలు ఆయా గ్రామాలకు ప్రయాణమయ్యాయి.

satyasai trust distribute daily needs to devadasi jogini women in ananthapuram district
దేవదాసీ, జోగినీ మహిళలకు సత్యసాయి ట్రస్ట్ ఆపన్నహస్తం

By

Published : Jul 30, 2020, 3:18 PM IST

దేవదాసీ, జోగినీ మహిళలకు ఆపన్న హస్తం అందించేందుకు అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ముందుకొచ్చింది. జిల్లాలోని 17 మండలాల్లో కటిక దారిద్ర్యంలో ఉన్న వారు ప్రస్తుతం కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సాయం చేయాలన్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సూచన మేరకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు స్పందించారు.

190 గ్రామాల్లో 1500 మంది దేవదాసీలను గుర్తించి వారికి నిత్యావసరాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కో మహిళకు 25 కిలోల బియ్యం, 2 కిలోల గోధుమపిండి, లీటర్ నూనె తదితర సరకులతో కిట్ అందివ్వనున్నారు. వాటిని తీసుకెళ్తున్న వ్యానులను ట్రస్ట్ మేనేజర్ ట్రస్టీ రత్నాకర్ జెండా ఊపి ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details