అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా సాధన కమిటీ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. గత కొన్ని రోజులుగా దీనిపై ఆందోళన చేస్తున్నారు. చిత్రావతి నదిలో ఈ రోజు వినూత్నంగా జలదీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో అందరికీ అనుకూలంగా ఉన్న పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
పుట్టపర్తిని జిల్లా చేయాలని.. చిత్రావతి నదిలో జలదీక్ష - పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జిల్లా సాధన కమిటీ
పుట్టపర్తి ప్రాంతంలో అనేక మౌలిక సదుపాయాలు ఉన్నందున పుట్టపర్తిని జిల్లాగా ఏర్పాటు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా సాధన కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు చిత్రావతి నదిలో వినూత్నంగా జల దీక్ష చేపట్టారు.

పుట్టపర్తి ప్రాంతంలో అనేక మౌలిక సదుపాయాలు విమానాశ్రయం, రైల్వే స్టేషన్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, యూనివర్శిటీ, ఉచిత విద్యాసంస్థలు ఉన్నాయని తెలిపారు. పాదయాత్ర లో భాగంగా సీఎం జగన్ పుట్టపర్తికి వచ్చినప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేసి హామీ నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన శ్రీసత్యసాయిబాబా పేరుతో జిల్లా ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:'కోర్టు ఆదేశాలతో ఎస్ఈసీగా నన్ను పునర్నియమించండి'
TAGGED:
పుట్టపర్తిని జిల్లా చేయాలి