అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా 8వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బాబా నిర్యాణం చెంది ఎనిమిదేళ్లు అయినా ... వారి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టపర్తి వస్తున్నారు. ఈ వేడుకల కోసం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ మందిరాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు.
ఉదయం వేదపారాయణంతో ఆరాధన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖుల ఉపన్యాసాలు, సత్యసాయి విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు, బాబా పూర్వపు ఉపన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. హిల్ వ్యూ స్టేడియంలో వేల మంది భక్తులకు నారాయణ సేవ ( అన్నదానం) చేశారు. స్టేడియంలో నూతనంగా నిర్మించిన 2.7 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ప్రారంభించారు.
వేలాది మంది భక్తులకు చీర, ధోవతులను పంపిణీ చేశారు. సత్యసాయి బాబా మహాసమాధి దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అలజడి లేకుండా.. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 45వేల మంది భక్తులకు అన్న, వస్త్రదానం చేస్తున్నమంటే.. బాబా వారు నేర్పించిన క్రమశిక్షణ ద్వారానేనని ట్రస్టు సభ్యులు రత్నాకర్ తెలిపారు.
ఘనంగా సత్యసాయి 8వ ఆరాధానోత్సవాలు... - vastra daanam
పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారి 8వ ఆరాధాన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
సత్యసాయి బాబా
ఇది కూడా చదవండి.