అనంతపురం జిల్లా సింగనమల కల్లుమడి గ్రామ సచివాలయానికి నూతన సర్పంచ్ మద్దతుదారులు తాళం వేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతురాలు పక్కీరమ్మ గెలుపొందారు. పక్కీరమ్మ బాధ్యతలు స్వీకరించినా.. మాజీ సర్పంచ్ సౌభాగ్యమ్మనే పెత్తనం కొనసాగిస్తున్నారు. దీనిపై పంచాయతీ సెక్రటరీ మసూద్ వలిని ప్రశ్నించారు. మాజీ సర్పంచ్ కూడా స్పందించకపోవటంతో సచివాలయానికి తాళం వేసి రాజకీయ నేతలతో కలిసి నిరసన చేపట్టారు. దీంతో పంచాయతీ కార్యదర్శి, గ్రామ వాలంటీర్లు చెట్ల కింద కూర్చొని తమ విధులు నిర్వహిస్తున్నారు.
సచివాలయానికి తాళం వేసిన సర్పంచ్ అనుచరులు... - singanamala latest news
అనంతపురం జిల్లా సింగనమల మండలం కల్లుమడి గ్రామ సచివాలయానికి నూతన సర్పంచ్ మద్దతుదారులు తాళం వేశారు. ఫలితంగా పంచాయతీ కార్యదర్శితోపాటు గ్రామ వాలంటీర్లు చెట్ల కింద కూర్చొని విధులు నిర్వర్తిస్తున్నారు.
![సచివాలయానికి తాళం వేసిన సర్పంచ్ అనుచరులు... Sarpanch locked the village secretariat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11310499-908-11310499-1617776079118.jpg)
సచివాలయానికి తాళం వేసిన సర్పంచ్