రాష్ట్రవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా(Sardar Vallabhbhai Patel Jayanti celebrations) నిర్వహించారు. పలు జిల్లాల్లో రన్ ఫర్ యూనిటీ(Run for Unity) కార్యక్రమాన్ని స్థానిక పోలీసులు నిర్వహించారు.
అనంతపురం జిల్లా
సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు అమోఘమని అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రానా టాటా అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జాతీయ ఐక్యత దినం నిర్వహించారు.పటేల్ సేవలను కొనియాడారు. అనంతరం రన్ ఫర్ యూనిటీ(Run for Unity)కార్యక్రమాన్ని నిర్వహించారు.
కడప జిల్లా
జాతీయ సమైక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని కడప ఎస్పీ అన్బురాజన్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని కడప జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'ఏక్తా పరుగు' ను నిర్వహించారు. పరుగులో ముందు వచ్చిన అభ్యర్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
నెల్లూరు జిల్లా
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ను పురస్కరించుకుని నెల్లూరులో 5కే రన్ నిర్వహించారు. రన్ ఫర్ యూనిటీ(Run for Unity) పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విజయారావు ప్రారంభించారు. నగరంలోని పోలీసు పేరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన రన్ కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్దనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు సాగింది. పటేల్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నందిగామ, గుడివాడ, మచిలీపట్నంలో పోలీసులు రన్ ఫర్ యూనిటీ(Run for Unity) కార్యక్రమాన్ని నిర్వహించారు. పటేల్ సేవలను అధికారులు కొనియాడారు.