Sanskrit instead of Telugu In Tenth Exam : విద్యార్థి భవిష్యత్తుకు పదవ తరగతి పరీక్షలు పునాది లాంటివి.. అందుకని ఎంతో కష్టపడి చదవుతారు. అలానే అనంతపురం జిల్లాలో ఓ విద్యార్థి చదివిన చదువును పరీక్షల్లో రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. కానీ అక్కడ ఇన్విజిలేటర్ ఇచ్చిన ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ అతను షాక్ అయ్యింది తాను చదివిన ప్రశ్నలు పరీక్షలో రానందుకు కాదు.. తన పరీక్ష పేపర్‌కు బదులుగా వేరే పేపర్ ఇచ్చారు ఆ విద్యార్ధికి..
రెండోసారీ అదే తప్పు.. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో పదో తరగతి పరీక్ష రాస్తున్న అజిత్ కుమార్‌కు రెండోసారి కూడా సంస్కృతం ప్రశ్నాపత్రమే సిబ్బంది అందించారు. రెండు వారాల క్రితం తెలుగు పరీక్ష రాసిన నిజవల్లి గ్రామానికి చెందిన అజిత్ కుమార్.. తెలుగు పేపర్‌కు బదులు సంస్కృతం ప్రశ్నాపత్రం అందించి సంబంధిత పాఠశాల సిబ్బంది.. ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. కుందుర్పి మండల కేంద్రంలో పరీక్ష రాస్తున్న అజిత్ కుమార్ సోమవారం కూడా 30 మార్కులకు చెందిన సంస్కృతం ప్రశ్నాపత్రం అందించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రానికి వెళ్తే తనకు సంస్కృతం పేపర్ ఇవ్వడంతో షాక్ అయ్యాడు. మొదటి రోజు సంస్కృతం ప్రశ్నాపత్రం ఇచ్చిన రోజు పరీక్షలు చివర్లో ప్రత్యేకంగా తెలుగు పేపర్ ఇచ్చి రాయిస్తామని చెప్పిన అధికారులు.. ఈ రోజు కూడా సంస్కృతం పేపరు ఇచ్చి తన కొడుకు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని తండ్రి నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు చేసిన తప్పుకు నా కుమారుడు ఇబ్బందులు పాలవుతున్నాడని తండ్రి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.