ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఘనంగా సంబురాలు.. ఆకట్టుకున్న పోటీలు

By

Published : Jan 14, 2021, 5:10 PM IST

అనంతపురంలో సంక్రాతి సంబరాలు ఉల్లాసంగా సాగుతున్నాయి. కబడ్డీ, రాతిదూలం వంటి సాంప్రదాయ ఆటల పోటీలతో అనంతపురం గ్రామీణ పరిధిలోని నారాయణపురంలో సందడి వాతావరణం నెలకొంది. వైకాపా నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

sankranthi celebrations in narayanapuram
అనంతపురంలో ఘనంగా సంక్రాంతి సంబురాలు

అనంతపురంలో ఘనంగా సంక్రాంతి సంబురాలు

అనంతపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నారాయణపురం గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ, రాతిదూలం పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా సాగుతున్నాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. వారితో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details