ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారులు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శంకరనారాయణ - రహదారులు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శంకరనారాయణ

సచివాలయంలోని 4వ బ్లాక్ లో రహదారులు భవనాల శాఖ మంత్రిగా మాలగుండ్ల శంకరనారాయణ బాధ్యతలు చేపట్టారు. మండల, గ్రామీణ ప్రాంతాల రహదారుల అనుసంధానం కోసం చేపట్టనున్న ప్రాజెక్టుపై తొలిసంతకం చేశారు.

Sankaranarayana, who took charge as the Minister of Roads and Buildings
రహదారులు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శంకరనారాయణ

By

Published : Jul 29, 2020, 12:53 PM IST

రాష్ట్ర మంత్రివర్గంలో మరో ఇద్దరికి చోటు లభించింది. రహదారులు, భవనాలశాఖ మంత్రిగా శంకరనారాయణ, బీసీ సంక్షేమశాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని 4వ బ్లాక్​లో రహదారులు భవనాల శాఖ మంత్రిగా మాలగుండ్ల శంకరనారాయణ బాధ్యతలు చేపట్టారు. మండల, గ్రామీణ ప్రాంతాల రహదారుల అనుసంధానం కోసం చేపట్టనున్న ప్రాజెక్టుపై తొలిసంతకం చేశారు. రూ.6,400 కోట్ల వ్యయంతో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు రుణంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 3,104 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కానున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధగౌతమి నదిపై వంతెన నిర్మాణం కోసం రూ.76.90 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details