ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బకాయిలు చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - Citu Protests for Arrears

గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

బకాయిలు చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
బకాయిలు చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

By

Published : Nov 5, 2020, 7:10 PM IST

అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 15 మంది.. గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించట్లేదని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గురువారం ఉదయం కార్మికులకు వేతనాలు చెల్లించాలని కోరుతూ రొద్ధం గ్రామ పంచాయతీ కార్యదర్శి మనోహర శర్మ విధులకు హాజరు కాని పరిస్థితుల్లో.. ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందజేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

'ధర్నా చేస్తాం'

సోమవారం లోగా వేతనాలు చెల్లించకపోతే కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని జిల్లా కార్యదర్శి రమేష్ హెచ్చరించారు. కార్మికులకు పని భారం తగ్గించాలని, వారాంతపు సెలవులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఫక్రుద్దీన్, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

'జగన్ లేఖ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దిగజార్చుతుంది'

ABOUT THE AUTHOR

...view details