పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని అనంతపురం పెద్దాసుపత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. కొవిడ్ సమయంలో కుటుంబాలను, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనులు చేస్తున్నామని కార్మికులు తెలిపారు. అరకొర రక్షణ పరికరాలతోనే పారిశుద్ధ్య పనులు చేస్తున్నామని వాపోయారు. ఇంత చేస్తున్నా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం పెద్దాసుపత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
కొవిడ్ సెంటర్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు ఆందోళన చేశారు. సమస్యలు చెప్పడానికి వస్తే పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం పెద్ద ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. కొన్ని నెలల నుంచి జీతాలు రావడం లేదని వాపోయారు.
అనంతపురం పెద్దాసుపత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
సమస్యలను ఆసుపత్రి సూపరింటెండెంట్ రామస్వామినాయక్‌కు తెలపడానికి వెళ్తుండగా అనుమతించలేదని కార్మికులు వాపోయారు. బయటకు వస్తున్న రామస్వామి నాయక్‌ను కార్మికులు అడ్డగించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీతాలు చెల్లిస్తామని కార్మికులకు ఆయన హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు.
ఇదీ చదవండీ... కొనసాగుతున్న కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 10,548 కేసులు నమోదు