అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. నియోజకవర్గ సరిహద్దులలో ఉన్న పెన్నా నది నుంచి కళ్యాణదుర్గం పట్టణానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమాచారంతో... పోలీసులు దాడులు చేశారు. నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి ఠాణాకు తరలించారు. అక్రమ ఇసుక రవాణాపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
కళ్యాణదుర్గంలో ఇసుక ట్రాక్టర్ల సీజ్ - sand tractors
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.
కళ్యాణదుర్గంలో ఇసుక ట్రాక్టర్ల సీజ్