ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం అజ్జయ్యదొడ్డి ఇసుక రీచ్ వద్ద రోడ్డుపై ట్రాక్టర్లు, టిప్పర్లు వందల సంఖ్యలో క్యూ కట్టాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వినియోగదారులు గంటలకొద్ది నిరీక్షించారు.
నూతన ఇసుక విధానంతో ఇక్కట్లు..! - కళ్యాణ దుర్గం తాజావార్తలు
నూతన విధానంతో ఇసుక దొరక్క సామాన్యులు సతమతమవుతున్నారు. అనంతపురం జిల్లాలో అజ్జయ్యదొడ్డి ఇసుక రీచ్ వద్ద టిప్పర్లు, ట్రాక్టర్లు వందల కొద్ది క్యూ కట్టాయి. కొంతమంది ఇసుక దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు.
sand issuse in kalyanadurgam