అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లిలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్స్ యజమానులను... స్థానికులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలు ఆపాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో ట్రాక్టర్స్ యజమానులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని...స్థానికులు ఆరోపించారు.
ఇసుక తరలింపుంలో ట్రాక్టర్ యజమానులు, గ్రామస్థుల మధ్య వివాదం - neelam palli sand issue latest news
అనంతపురం జిల్లా నీలంపల్లిలో ఇసుక తరలింపు విషయంలో వాగ్వాదం నెలకొంది. ఇసుక తరలిస్తోన్న ట్రాక్టర్స్ను స్థానికులు అడ్డుకున్నారు. వీరి ఆందోళనతో ట్రాక్టర్స్ యజమానులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు చొరవతో గొడవ సద్దుమణిగింది.
sand-issue-in-ananthapuram-neelam-palli