అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలోని ఆర్యపేట వీధిలో మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తూ.. స్థానికులను తెగ ఇబ్బంది పెడుతోంది. ఈ సమస్యను అధికారులు పట్టించుకోవటం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ వీధి మీదుగా నిత్యం రాకపోకలు సాగించేవారు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
'మురుగు వేధిస్తోంది... అధికారులూ.. సమస్యను పరిష్కరించండి' - 'మురుగు మరగుతోంది...చర్యలు తీసుకోండి'
అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలోని ఆర్యపేట వీధి ప్రజలు.. మురుగు సమస్యతో సతమతం అవుతున్నారు. చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతం జలమయమైపోతోందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

'మురుగు మరగుతోంది...చర్యలు తీసుకోండి'
పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువ పక్కనే నీటి కుళాయిలు ఉన్నాయని.. చిన్న పాటి వర్షానికే ఆ ప్రాంతం చెరువును తలపిస్తుందని చెప్పారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకొంటున్నారు.