నిమ్మగడ్డ రమేష్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు. అనంతపురంలో సమావేశం నిర్వహించిన ఆయన... వైకాపా ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌పై ఎందుకింత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందో అర్ధం కావటం లేదన్నారు.
'ఎన్నికల కమిషనర్‌పై ఎందుకింత కక్షసాధింపు' - 'ఎన్నికల కమిషనర్‌పై ఎందుకింత కక్షసాధింపు'
వైకాపా ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌పై ఎందుకింత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందో అర్ధం కావటం లేదని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
'ఎన్నికల కమిషనర్‌పై ఎందుకింత కక్షసాధింపు'
స్థానిక ఎన్నికలే జరిగి ఉంటే కరోనా విజృంభించి ఉండేదన్నారు. రోజూరోజుకు కరోనా కేసులు పెరుగుతుంటే వైకాపా నేతలు రమేష్ కేసులో సుప్రీంకోర్టుకు వెళుతామనటం ఏంటని ప్రశ్నించారు. వైకాపా ప్రజాపాలన మరచి ప్రవర్తిస్తోందన్నారు. వైకాపాకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.