ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విశాఖ జిల్లా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యసాయి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయం పూర్ణచంద్ర ఆడిటోరియంలో విశ్వశాంతికి, విశ్వమానవ కల్యాణానికి భక్తులు వ్రతాలు నిర్వహించారు. సత్యసాయి నామాలను కీర్తిస్తూ గణపతి పూజ, సహస్ర లింగార్చన, కుంకుమార్చన పూజా కార్యక్రమాలను వేదపండితులు నిర్వహించారు. మహామంగళహారతి ఇచ్చి పూజను ముగించారు. ప్రపంచ మానవాళి హృదయాల్లో సత్యసాయి కొలువై ఉన్నారని ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ తెలిపారు. సాయి ప్రేమతత్వంతో 150 దేశాల్లో భక్తులను సేవా మార్గం వైపు పయనింప చేశారన్నారు. సేవ, ప్రేమతోనే దైవత్వం సిద్ధిస్తుందని తెలిపారు. దేవుడు కొలువై ఉన్న సత్యాన్ని గ్రహించి ఆపద సమయంలో తోటి మానవునికి చేయూతను అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సేవ తత్వమును అలవర్చుకోవాలి అన్నారు.
ప్రపంచ శాంతిని కోరుతూ విశాఖ భక్తుల సామూహిక వ్రతాలు - visakha devotees
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విశాఖ భక్తులు సామూహిక వ్రతాలు నిర్వహించారు. ప్రపంచమంతా శాంతి, సౌఖ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
సామూహిక వ్రతాలు