ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సచివాలయ ఉద్యోగిపై దాడిచేసిన ఎస్సైని శిక్షించాలి' - నెల్లూరులో సచివాలయ ఉద్యోగిపై ఎస్సై దాడి

నెల్లూరులో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ ఉద్యోగిపై స్థానిక ఎస్సై దాడి చేయడాన్ని గ్రామ, వార్డు సచివాయాల ఉద్యోగుల సంఘం తప్పుబట్టింది. విధులకు హాజరవుతున్న ఉద్యోగిపై ఎస్సై అకారణంగా దాడిచేశారని...అసోషియేషన్ సభ్యులు ఆరోపించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న తమపై దాడిచేయడం సరికాదన్నారు. తక్షణమే ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Sachivalaya employee association condemn attack on employee in Nellore
గ్రామ, వార్డు సచివాయాల ఉద్యోగుల అసోషియేషన్ సభ్యులు

By

Published : Apr 3, 2020, 12:09 PM IST

సచివాయల ఉద్యోగిపై దాడిని ఖండించిన గ్రామ, వార్డు సచివాయాల ఉద్యోగుల అసోషియేషన్

నెల్లూరులో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ ఉద్యోగిపై ఎస్సై దాడి చేయటాన్ని గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల అసోషియేషన్ తీవ్రంగా ఖండించింది. గురువారం విధులకు వెళ్తున్న అడ్మినిస్ట్రేషన్ సెకట్రరీపై.. స్థానిక ఎస్సై వివరాలు కనుక్కోకుండా దాడి చేశారని.. విధులకు వెళ్తున్నానని చెబుతున్నా వినకుండా కొట్టారని ఆరోపించారు. అనంతపురంలో మాట్లాడిన సచివాలయ ఉద్యోగులు.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్ విధించిన నాటి నుంచి శక్తికి మించి పనిచేస్తున్నామని చెప్పారు. అలాంటి సమయంలో ఇలా దాడి చేయడం సబబు కాదన్నారు. సచివాయలం ఉద్యోగిపై దాడి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details