అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో 'సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా' గేయరచయిత అల్లామా ఇక్బాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముస్లిం నగారా, టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు హనుమంతు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఉర్దూ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సారే జహాసే అచ్చా గీతాన్ని ఆలపించారు. దేశభక్తి గీతాల రచయితలను ముఖ్య అతిథులు కొనియాడారు. దేశభక్తి గేయాల్లో గల భావనను విద్యార్థులకు తెలియపరిచారు. అనంతరం విద్యార్థులకు దేశభక్తి గీతాల పుస్తకాలను అందించారు.
ఘనంగా 'సారే జహాసే అచ్చా' గేయరచయిత అల్లామా ఇక్బాల్ జయంతి - Saare Jahaase Achcha' song writer jayanthi at anantapuram district news
సారే జహాసే అచ్చా.. హిందూ సితా హమారా' గేయరచయిత అల్లామా ఇక్బాల్ జయంతిని అనంతపురం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
గేయరచయిత అల్లామా ఇక్బాల్ జయంతి