ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో 850 రైతు భరోసా కేంద్రాలు - అనంతపురంలో రైతు భరోసా కేంద్రాలు

అనంతపురం జిల్లాలో రైతు భరోసా కేంద్రాలను ఆన్​లైన్ ద్వారా సీఎం జగన్ ప్రారంభించారు. జిల్లాలో 850 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.

Rythubarosa
Rythubarosa

By

Published : May 31, 2020, 12:11 AM IST

రైతులకు అన్ని రకాల సేవలను గ్రామస్థాయిలోనే అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడుతాయని వైకాపా నేతలు అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా రామగిరి మండల కేంద్రంలో రైతు భరోసా కేంద్రాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రం ప్రారంభం తరువాత అందులో ఎలాంటి సదుపాయలు ఉన్నాయన్నది పరిశీలించారు.

జిల్లాలో 896 సచివాలయాలు ఉంటే.. 850చోట్ల రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ కేంద్రాల్లో రైతులకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సలహాలు, సమాచారం ఇవ్వడంతో పాటు విత్తనం, ఎరువులు అందుతాయన్నారు. దీని ద్వారా గ్రామాల్లోనే రైతులకు సేవలందుతాయన్నారు. ఈ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు ప్రజల వద్దకే పాలనను అందిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. జిల్లాలో వేరుశనగ విత్తనాన్ని రైతుల వద్దకే తీసుకెళ్తున్న సేవలు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మరోసారి పేలిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌

ABOUT THE AUTHOR

...view details