ఆధార్ కార్డ్‌కు ఫోన్ అనుసంధానం చేయడం కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనంతపురం జిల్లా తనకల్లు ఆధార్ సేవ కేంద్రం వద్దకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులు (మహిళలు) ఆధార్ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ పథకం గడువు సమీపిస్తుండటంతో ఆధార్‌కు మొబైల్ లింక్ కోసం మహిళలు బారులు తీరారు.
ఒక్కరోజు 50 మందికి మాత్రమే మొబైల్ అనుసంధానం చేయడానికి వీలు ఉంటుందని సిబ్బంది తెలియజేస్తున్నా.. మహిళలు వినిపించుకోలేదు. అర కిలోమీటరు మేర బారులు తీరారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మహిళలకు నచ్చజెప్పి తిప్పి పంపించారు.