ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవి భారత్‌లో కథనం వచ్చింది... ఊరికి ఆర్టీసీ బస్‌ వచ్చింది... - ఈటీవి భారత్' కథనానికి స్పందించిన ఆర్టీసీ

ఇన్ని రోజులు ఆ ఆదర్శ పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు భయపడేవారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆ పాఠశాలకు ఒకే బస్సు ఉండేది. అనంతపురం జిల్లా ఉరవకొండ ఆదర్శ పాఠశాల విద్యార్ధుల బస్సు సమస్యను గమనించిన ఈటీవీ భారత్ పరిష్కరించింది. ఈటీవీ భారత్, ఈటీవీలో వచ్చిన కథనానికి స్పందించి ఆర్టీసీ అధికారులు ఆ విద్యార్థులకు మరొక బస్సు ఏర్పాటు చేశారు.

రెండు బస్సులు ఆదర్శ పాఠశాలకు

By

Published : Sep 25, 2019, 2:31 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో పాఠశాలకు ఒకే బస్సులో 150 నుంచి 160 దాకా విద్యార్థులు వెళ్తూ ఉండటం చూసిన 'ఈటీవీ భారత్' వారి సమస్యను పరిష్కరించింది. కొన్ని రోజుల క్రితం 'పేరుకే ఆదర్శం వెళ్లాలంటే భయం భయం' అనే వార్తను ఈటీవీ భారత్​లో చూసిన ఆర్టీసీ అధికారులు స్పందించి ఇక్కడ మరొక బస్సు ఏర్పాటు చేశారు. దాంతో విద్యార్థులు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. తమ పాఠశాలకు రెండు బస్సులను ఏర్పాటు చేయడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించిన ఈటీవీ భారత్​కు విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈటీవి భారత్' కథనానికి స్పందించిన ఆర్టీసీ

ABOUT THE AUTHOR

...view details