అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర బాబు తనిఖీ చేశారు. డిపోలో బస్సులు పరిశీలించారు. బస్టాండ్‌లో తనిఖీలు చేశారు. బస్సుల రాకపోకల సమయం వివరాలు ప్రయాణికులకు కనిపించేలా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ కౌంటర్‌ను బస్టాండ్‌లో ఓ మూల ఏర్పాటు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించి సంస్థ పురోగతికి పని చేయాలని సూచించారు. ఆర్టీసీ యూనియన్ నాయకుల సమస్యలపై చర్చించారు.
ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఈడీ తనిఖీలు - busstand
అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోను ఎగ్డిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్రబాబు తనిఖీ చేశారు. బస్సుల వివరాలపై ఆరా తీశారు.
ఆర్టీసీ