ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారంటూ తాడిపత్రి ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్ రామయ్య ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకునేందుకు యత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. తన ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా.. విధులు నిర్వహించాలంటూ పైఅధికారులు నిత్యం తనను వేధిస్తున్నారని రామయ్య ఆరోపించారు. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. పై అధికారులు వేధిస్తున్నారని ఆరోపణ - ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం న్యూస్
అధికారులు వేధిస్తున్నారంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి డిపో వద్ద ఓ ఆర్టీసీ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు ఆయన్ను అడ్డుకున్నారు. ఆరోగ్యం సరిగా లేకున్నా విధులు నిర్వహించాలంటూ పై అధికారులు వేధిస్తున్నారని డ్రైవర్ రామయ్య ఆరోపించారు.

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం